Sunday, April 27, 2008

నీవుండగా భయమేలరా . . . గురుదేవా . . .

ఈ పాటను వినండి
ఆ . . . ఆ . . . ఆ . . . ఆ . . .
నీవుండగా భయమేలరా . . . గురుదేవా . . .
నీఅండన దిగులేలరా . . .
నీ కరునారాసధారలో . . .
కడదేరిపోనీయరా . . .
ఆ . . . ఆ . . . ఆ . . . ఆ . . .

నా మనసు ఎపుడో నీ కోవెలాయే
ఆ కోవెలలోన నువు దైవమాయే "2."
నా శ్వాస క్రియలె నీ గానమాయే
నా ప్రాణమే నీదైతే నేనెవరినయ్యా . . .

నీవుండగా భయమేలరా . . . గురుదేవా . . .
నీఅండన దిగులేలరా . . .
నీ కరునారాసధారలో . . .
కడదేరిపోనీయరా . . .

కష్టాలలోన కరునించినావు
నా చేయిపట్టి నడిపించినావు
కలి మాయలో తోలిగించి కాపాడగా
మా కోసం నుమరలా రావా దేవా

నీవుండగా భయమేలరా . . . గురుదేవా . . .
నీఅండన దిగులేలరా . . .
నీ కరునారాసధారలో . . .
కడదేరిపోనీయరా . . .

Saturday, April 26, 2008

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సుప్రభాతం

ఓం నమో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః
శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సుప్రభాతం వినాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Sunday, April 20, 2008

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులందరికీ నమస్కారములు.

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులందరికీ నమస్కారం. శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిషత్తు ను తెలుపుతూ వ్రాసిన కాలజ్యనమును గురించి తెలియని ఆంధ్రులు ఉండరేమో. ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్యనము, తత్వాలు, కాలికాంబ శతకం ఎంతో ప్రాచుర్యం పొందినాయి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్లో గత కొంతకాలంగా వెతుకుతున్నాను. కాని ఎక్కడా కూడా పూర్తిగా సమాచారం ఉన్నట్టు నాకు కన్పించలేదు. అందువలన నాకు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి గురించి చెప్పేగలిగెంత విషయ పరిగ్యానము, అనుభవము, వయస్సు నాకు లేకపోయినా కొంత సాహసము చేస్తున్నాను.
ప్రస్తుతానికి వీరబ్రహ్మేంద్రస్వామి భక్తీ పాటలను కొన్ని ఆన్ లైనులో ఉంచడం జరిగింది. వాటిని విని స్వామి యొక్క కృపకు పాత్రులుకాగలరని, అలాగే నా ఈ చిరు ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుతున్నాను.
పాటలను వినడానికి ఈ క్రింద లింకును క్లిక్ చేయండి. http://veerabrahmamgaru.googlepages.com/